: ఫిల్మ్ నగర్ పార్కులో రూ.50 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం.. ముఠా సభ్యుల అరెస్టు


హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని ఒక పార్కులో రూ.50 లక్షల కొత్త కరెన్సీని బదిలీ చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. పెద్దమొత్తంలో నగదు బదిలీకి ఒక ముఠా పాల్పడుతోందనే సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ కు చెందిన ఒక బడా బాబు వద్ద ఉన్న బ్లాక్ మనీని తీసుకుని వైట్ మనీ ఇచ్చేందుకు పెద్దమొత్తంలో కమీషన్ తీసుకునేలా ఆ ముఠా ఒప్పందం కుదుర్చుకుందని పోలీసులు చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి రూ.50 లక్షల కొత్త కరెన్సీని ఈ ముఠా తీసుకువచ్చినట్లు తమ దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News