: నాడు ఎన్టీఆర్-రాజ్ కుమార్.. నేడు బాలకృష్ణ-నేను!: కన్నడ సినీ నటుడు శివరాజ్ కుమార్
బాలకృష్ణ బెంగళూరు వచ్చినప్పుడల్లా తనను కలుస్తారని కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అన్నాడు. బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో శివ రాజ్ కుమార్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్, తన తండ్రి రాజ్ కుమార్ ల మధ్య సోదర అనుబంధం ఉండేదని, ఇప్పుడు అదే అనుబంధం బాలకృష్ణ, తన మధ్య ఉందని అన్నారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో తన పాత్రను బాగానే పోషించానని భావిస్తున్నానని, బాలకృష్ణకు ఎంతో ముఖ్యమైన ఈ చిత్రంలో తాను నటించడం సంతోషంగా ఉందని శివరాజ్ కుమార్ చెప్పారు.