: ‘అంతా చీకటే’.. ఆ పట్టణంలో కొన్ని రోజుల నుంచి సూర్యుడు కనిపించడం లేదు!
అమెరికాలోని బారో పట్టణంలో కొన్ని రోజుల క్రితం అస్తమించిన సూర్యుడు మళ్లీ వచ్చే ఏడాదిలోనే కనిపించనున్నాడు. ఉత్తర భాగంలోని అలస్కా ప్రాంతంలో భూభ్రమణంలోని అసాధారణ చర్యల వల్ల ఈ పరిస్థితి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత నెల 18న అస్తమించిన సూర్యుడు మళ్లీ ఉదయించకుండా పోవడంతో ఆ ప్రాంతమంతా చీకటిమయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం భూమి ఉత్తరార్థగోళం సూర్యుడికి దూరంగా జరిగి ఉంది. ఈ పరిణామం వల్లే ఆ ప్రాంతంలో మళ్లీ సూర్యుడు ఉదయించడం లేదు. సూర్యుడికి దగ్గరగా మళ్లీ భూమి వచ్చే ఏడాది జనవరి 22న వస్తుందని, ఆ ప్రాంత వాసులు మళ్లీ సూర్యోదయాన్ని అప్పుడే చూస్తారని చెబుతున్నారు. పగటిపూట కొన్ని గంటలు మాత్రమే ఆ ప్రాంతంలో వెలుతురు కనిపిస్తోంది. అనంతరం చీకటిగా మారుతోన్న ఆ సమయంలో బారో పట్టణాన్ని ‘అట్కియగ్విక్’గా పిలుస్తున్నారు.