: మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వలేం: స్పష్టం చేసిన కేంద్రం


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి నిధులు ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మిషన్ కాకతీయకు వచ్చే మూడేళ్లలో ఆర్థిక సాయం చేయాలంటూ నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని... అయినప్పటికీ, ప్రత్యేక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఆర్థిక సహాయాన్ని ఈ పథకానికి చేయడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయపడ్డట్టు జలవనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ బాల్యన్ లోక్ సభలో తెలిపారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ కోసం గత ఏడాది రూ. 44.87 కోట్ల మేర నిధులను విడుదల చేశామని కేంద్ర మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News