: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూల పవనాలు లేకపోవడంతో... భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 329.26 పాయింట్లు కోల్పోయి 26,230.66కు పడిపోయింది. నిఫ్టీ 106.10 పాయింట్లు నష్టపోయి 8,086.80కు చేరింది. ఈనాటి టాప్ గెయినర్స్... ఐషర్ మోటార్స్(3.15%), బాలకృష్ణ ఇండస్ట్రీస్ (2.40%), మంగళూరు రిఫైనరీస్ (2.09%), గేట్ వే దిస్త్రి పార్క్స్ (2.00%), గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ (1.90%). టాప్ లూజర్స్... భారత్ ఫైనాన్షియల్స్ (6.05%), ఎంఎంటీసీ లిమిటెడ్ (5.94%), టాటా కమ్యూనికేషన్స్ (5.57%), ఇండియా సిమెంట్స్ (5.49%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (5.23%).