: అందుకేనా.. యువరాజ్ సింగ్ పెళ్లికి ధోనీ వెళ్లలేదు?
వరల్డ్ కప్ ల వీరుడు యువరాజ్ సింగ్ వివాహంలో టీమిండియా ఆటగాళ్లంతా కనిపించినా పరిమత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కనిపించకపోవడం క్రీడావర్గాల్లో కలకలం రేపింది. దీంతో ఇంతకీ ధోనీ ఎందుకు హాజరకాలేదని ఆరాతీయగా, గతంలో ధోనీ వివాహం సందర్భంగా అందర్నీ పిలిచి, యువీని పిలవలేదు. అందుకు కారణం అంతకు ముందు యువీ తండ్రి యోగ్ రాజ్ సింగ్ చేసిన ఆరోపణలే. వరల్డ్ కప్ లో రాణించిన యువీ పతనమవ్వడానికి కారణం ధోనీ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో యువీ, ధోనీ మధ్య గ్యాప్ ఏర్పడింది. దీంతో యువీని ధోనీ తన వివాహానికి ఆహ్వానించలేదు. అనంతరం ఓ ఇంటర్వ్యూలో యువీ మాట్లాడుతూ, తన వివాహానికి ధోనీ ఆహ్వానించలేదు కనుక నా వివాహానికి ధోనీని కూడా ఆహ్వానించనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లంతా యువరాజ్ సింగ్ వివాహానికి హాజరైనప్పటికీ ధోనీ దూరంగా ఉన్నాడు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఈ వేడుకలో పాల్గొన్న టీమిండియా ఆటగాళ్లు మూడో టెస్టు విజయాన్ని అక్కడే సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.