: తాను ఎదుర్కొన్న కఠిన బౌలర్ ఎవరో చెప్పిన ద్రవిడ్


టీమిండియాకు ఆడిన అత్యున్నత బ్యాట్స్ మెన్లలో రాహుల్ ద్రవిడ్ ఒకడు. చేజారిపోతున్న మ్యాచ్ లను సైతం... తన బ్యాటింగ్ నైపుణ్యంతో ఎన్నోసార్లు గట్టెక్కించాడు ద్రవిడ్. అభేద్యమైన అతని డిఫెన్స్ ను చూసి... అందరూ ముద్దుగా అతన్ని 'ది వాల్' అని పిలుచుకున్నారు. అలాంటి ద్రవిడ్ తాను ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత కఠినమైనవాడు, తెలివైనవాడు ఎవరో చెప్పాడు. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మెక్ గ్రాత్ తాను ఎదుర్కొన్న బౌలర్లలో అందరికన్నా కఠినమైనవాడు అని చెప్పాడు. ఆఫ్ స్టంప్ పై తనకున్న కమాండ్ ను మెక్ గ్రాత్ లా ఎవరూ సవాల్ చేయలేకపోయారని చెప్పాడు. మంచి పేస్, లైన్ అండ్ లెంగ్త్, యాక్యురసీ, కంట్రోల్ ఇవన్నీ మెక్ గ్రాత్ సొంతమని తెలిపాడు. అతని బౌలింగ్ లో ఎవరైనా ఒక పరుగు లేదా ఒక ఎక్స్ ట్రా కోసం ఆలోచిస్తారని కొనియాడాడు. తన తరంలో ఆస్ట్రేలియా ఉత్తమ క్రికెట్ జట్టు అయితే, మెక్ గ్రాత్ ఉత్తమ బౌలర్ అని చెప్పాడు.

  • Loading...

More Telugu News