: ఎన్ఎస్ఈ తొలి మహిళా మేనేజింగ్ డైరెక్టర్ రాజీనామా


నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మొట్టమొదటి మహిళా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన చిత్రా రామకృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తన పదవి నుంచి దిగిపోయినట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఆమె రాజీనామా విషయాన్ని స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి త్వరలోనే ఎన్ఎస్ఈ వెల్లడించనుంది. 1992 నుంచి ఆమె ఎన్ఎస్ఈలో పనిచేస్తున్నారు. చిత్రా రామకృష్ణ పదవీకాలం మార్చి 2018 వరకు ఉన్నప్పటికీ, బోర్డుతో విభేదాల కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్ఎస్ఈకి ఎండీగా ప్రస్తుతం జె. రవిచంద్రన్ వ్యవహరిస్తారని తెలుస్తోంది. కాగా, చిత్రా రామకృష్ణ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్ఛేంజస్ కు ఇటీవలే మహిళా చైర్ పర్సన్ గా కూడా ఎంపికయ్యారు.

  • Loading...

More Telugu News