: ఇంద్రాణి ముఖర్జియా పాత్రకు 'నో' చెప్పిన టబు!


కార్పొరేట్ సర్కిల్స్ లో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యోదంతాన్ని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్ లో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే, 2015లో విడుదలైన ‘రహస్య’ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు మనీశ్ గుప్తా రూపొందిస్తున్నాడు. కూతురు షీనా బోరాను హతమార్చిన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా పాత్రకు బాలీవుడ్ ప్రముఖ నటి టబును ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే, ఈ చిత్రం స్క్రిప్ట్ విన్న టబు, ఆ పాత్రలో నటించేందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. రాహుల్ ముఖర్జీ పాత్రలో నటించేందుకు నటుడు విక్కీ కౌశలన్ ను సంప్రదించగా, ఆయన కూడా తిరస్కరించారనే వార్తలు బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. కాగా, 2008లో నోయిడా యువతి ఆరుషి తల్వార్, వారి ఇంట్లో పనిమనిషి హేమ్ రాజ్ దారుణ హత్యకు గురైన అంశాన్ని ఆధారంగా తీసుకుని ‘రహస్య’ చిత్రాన్ని మనీశ్ గుప్తా తెరకెక్కించారు.

  • Loading...

More Telugu News