: విశాఖలో సందడి చేసిన వదిన, మరిది... సమంత, అక్కినేని అఖిల్
విశాఖపట్నంలో సినీనటులు, కాబోయే వదిన, మరిదిలు సమంత, అక్కినేని అఖిల్ సందడి చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని ఈ రోజు వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ మొత్తం కలియదిరిగి వివిధ డిజైన్ల వస్త్రాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా సమంత, అఖిల్ లను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. దీంతో, అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు, అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యను సమంత పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లికంటే ముందే అక్కినేని అఖిల్ పెళ్లి జరగబోతోంది. ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ ను అఖిల్ పెళ్లాడబోతున్నాడు.