: ఈశాన్య రాష్ట్రాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి: వెంకయ్యనాయుడు
ఈశాన్య రాష్ట్రాలు అన్నింట్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయని, పశ్చిమ బెంగాల్‌కి ఆర్మీ వెళ్లడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మిలటరీ బలగాల సేవలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. మిలటరీ బలగాల తనిఖీ అంశం ఎంతో సున్నితమైనదని, తనిఖీలు అనేవి ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాలు కావని చెప్పారు. ప్రతిపక్షాలు చీప్ పాలిటిక్స్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడమే కాకుండా, భారత ఆర్మీని అనవసర వివాదాల్లోకి లాగుతున్నాయని అన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే మిలటరీ బలగాల తనిఖీలు జరుగుతున్నాయని చెప్పారు.