: ఆప్ ఎంపీ భగవంత్ మాన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న లోక్ సభ స్పీకర్
పెద్దనోట్ల రద్దుపై గందరగోళం నెలకొనడంతో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు భగవంత్ మాన్‌పై లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ క్షమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వచ్చేవారం లోక్‌సభకు హాజరుకాకూడదని స్పీకర్ ఆయనకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపీ మాన్ గతంలో పార్లమెంటు ఆవరణలో వీడియో చిత్రీకరించి, ఆపై ఈ విజువల్స్‌ను సోషల్‌మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. భగవంత్ తన ఇంటి వద్ద బయలుదేరినప్పటి నుంచి పార్లమెంటు ఆవరణలోని లోక్ సభ లోపలికి వెళ్లే వరకు అన్ని పరిణామాలను వీడియో తీసి ఈ పోస్ట్ చేశారు. పార్లమెంటు ఆవరణలో వీడియో చిత్రీకరణ చేయకూడదనే నిబంధనలు ఉన్న నేపథ్యంలో మాన్ చేసిన ఈ దుస్సాహసానికి గానూ ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు.