: 'బిగ్ బాస్' టీవీషో హోస్ట్ గా నటి రేవతి
మలయాళంలో నిర్వహించబోయే 'బిగ్ బాస్' టీవీ రియాలిటీ షోకి నటి, దర్శకురాలు రేవతి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. పలు భాషల్లో నిర్వహించిన ఈ షోకి ఇప్పటివరకు పురుషులే హోస్ట్ గా ఉన్నారు. ఈ షోలన్నీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా పొందాయి. అయితే, మొదటిసారి ఈ షోకి మహిళా హోస్ట్ గా రేవతిని ఎంపికచేయడం విశేషం. హిందీ వెర్షన్ కు నటుడు సల్మాన్ ఖాన్, కన్నడ వెర్షన్ కు నటుడు సుదీప్ హోస్ట్ గా వ్యవహరించారు. అటు మరాఠీ వెర్షన్ కు నటుడు రితేశ్ దేశ్ ముఖ్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.