: నేడు పరిస్థితి ఇంకా ఘోరం... 6 వేలు, 5 వేలు పోయి 2 వేలు మాత్రమే!
తెలుగు రాష్ట్రాలకు నేడు రూ. 4 వేల కోట్లకు పైగా నగదు వచ్చిందని, బ్యాంకుల్లో కరెన్సీ కష్టాలు ఉండవని పొద్దుటి నుంచి క్యూలైన్లలో నిలబడ్డ ప్రజలకు తీవ్ర నిరాశే ఎదురైంది. వారంలో లేదా రోజులో గరిష్ఠంగా 24 వేల రూపాయలు విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఉండగా, కరెన్సీ రద్దు తరువాత నగదు లేదన్న సాకును చూపిస్తూ, విత్ డ్రా మొత్తాన్ని రూ. 6 వేలకు, ఆపై రూ. 5 వేలకు తగ్గించిన బ్యాంకులు నేడు ఆ మొత్తాన్ని కూడా ఇవ్వలేమని చేతులెత్తేశాయి. ఎంతో ఆశగా తమ ఖాతా నుంచి డబ్బు తీసుకోవాలని వచ్చిన వారికి రూ. 2 వేలు మాత్రమే విత్ డ్రాకు అవకాశమిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంకు నుంచి తమకు నగదు రాలేదని, ఏపీకి వచ్చిన రూ. 2,500 కోట్లలో తమ బ్యాంకుకు ఒక్క లక్ష కూడా రాలేదని, మధ్యాహ్నం తరువాత ఏమైనా కరెన్సీ వస్తే ప్రజలకు పంచుతామని గుంటూరులోని ఓ బ్యాంకు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.