: ఆ మారుమూల గ్రామం దేశంలోని నగరాలన్నింటికీ ఆదర్శం.. అక్కడ డబ్బు కొరత అన్న సమస్యే లేదు


దేశంలో న‌గ‌దు కొర‌త కార‌ణంగా ప్ర‌జ‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. చ‌దువుకున్న వారికి కూడా న‌గ‌దుర‌హిత లావాదేవీల గురించి అంత‌గా అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. దేశంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలతో పాటు నగరాల్లోనూ ఈ సమస్య ఉంది. అయితే, మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉన్న మారుమూల దేశాయి గ్రామం దేశంలోనే మొదటి నగదురహిత లావాదేవీలు జ‌రిపే గ్రామంగా నిలిచి ఆద‌ర్శంగా నిలుస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ అంశంలో ఆ గ్రామం సాధించిన ఘ‌న‌త‌ను ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సుధీర్‌ ముంగన్‌తివార్ మీడియాకు వివ‌రించి చెప్పారు. ఆ గ్రామం మ‌రింత ముందుకు వెళ్లింద‌ని, నిన్న‌టి నుంచి పూర్తిగా లావాదేవీలన్ని స్వైపింగ్‌ మిషన్‌ ద్వారానే జరుగుతున్నాయని సుధీర్‌ ముంగన్‌తివార్ పేర్కొన్నారు. స్థానిక ఎన్జీవో వీర్‌ సవార్కర్‌ ప్రతిష్టాన్ న‌గ‌దుర‌హిత లావాదేవీల‌పై ఆ గ్రామ‌ ప్రజలకు అవగాహన కల్పించాడ‌ని అందుకోసం ఆయ‌న‌ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సిబ్బంది సాయం తీసుకున్నాడ‌ని చెప్పారు. ఆ గ్రామంలో కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులతో పాటు అంద‌రూ ఇప్పుడు స్వైపింగ్‌ మిషన్లను ఉపయోగిస్తున్నారని ఆయ‌న తెలిపారు. ఆ గ్రామం ఇచ్చిన స్ఫూర్తితో త్వరలోనే త‌మ రాష్ట్రాన్ని దేశంలోనే నగదు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News