: వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్... షటప్!: రాజ్యసభలో టీఎంసీ ఎంపీ ఆగ్రహం
పశ్చిమబెంగాల్ లో సైన్యం మోహరింపు వ్యవహారం రాజ్యసభను కుదిపేసింది. చిన్నగా ప్రారంభమైన వివాదం... చివరకు తీవ్రపదజాలాన్ని ఉపయోగించుకునేంత వరకు వెళ్లింది. తృణమూల్ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ ఈ అంశంపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతున్న సమయంలో... అధికారపక్ష సభ్యుల నుంచి కామెంట్లు వినిపించాయి. దీంతో, ఆగ్రహం పట్టలేకపోయిన సుఖేందు శేఖర్... వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్, షటప్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమబెంగాల్ లో సైన్యాన్ని ఎందుకు మోహరించారు... ఇదేమైనా జాతీయ అత్యవసర పరిస్థితా? అంటూ నిలదీశారు. సుఖేందు వ్యాఖ్యల పట్ల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా అదే స్థాయిలో స్పందించారు. పశ్చిమబెంగాల్ కు సైన్యం వెళ్లడం ఇదే తొలిసారి కాదని... గత ఏడాది కూడా ఇదే సమయంలో సైన్యం వెళ్లిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలకు కూడా సైన్యం వెళుతుంటుందని తెలిపారు.