: పాత 500 నోట్లు ఇంకా ఉన్నాయా? ఇక్కడ వాడేసుకోండి... 15 వరకూ మాత్రమే సుమా!
రేపటి నుంచి పాత 500 రూపాయల కాగితాలను పెట్రోలు బంకులు, విమానాల్లో టికెట్ల కొనుగోలుకు వాడరాదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ డిసెంబర్ 15 వరకూ ఈ నోట్లను కొన్ని చోట్ల వాడుకునే వెసలుబాటు ఉంది. ప్రభుత్వ ఆసపత్రుల్లోను, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై ఔషధాల దుకాణాల్లో, రైల్వే టికెట్ కౌంటర్లలో, ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థల్లో, కో-ఆపరేటివ్ స్టోర్లలో (గరిష్ఠంగా రూ. 5 వేలు) పాత 500 నోట్లను వాడవచ్చు. వీటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే పాల బూత్ లు, శ్మశానాలు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొనుగోలుకు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహణలోని మ్యూజియాల్లో ప్రవేశం కోసం, పోలీసులు విధించే జరిమానాలు, పన్నులు, మునిసిపల్, స్థానిక సంస్థలకు చెల్లింపులు, నీటి, విద్యుత్ బకాయిలు, బిల్లులు తదితరాలను చెల్లించవచ్చు. ఇదే సమయంలో ముందస్తు చెల్లింపులను మాత్రం అనుమతించబోరు.