: నయనతారది పెళ్లా? లేక సహజీవనమా?


సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. హిట్ సినిమాల ద్వారానే కాకుండా, ఎప్పుడూ ఎవరో ఒకరితో లఫ్ ఎఫైర్లు నడుపుతూ... వార్తల్లో నిలుస్తుంటుంది ఈ భామ. గతంలో హీరో శింబు, దర్శకనటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో నయన్ ప్రేమాయణం నడిపింది. వీరిద్దరితో నయన్ వ్యవహారం ఆల్ మోస్ట్ పెళ్లి వరకు వెళ్లి... ఆ తర్వాత ఆగిపోయింది. తాగాగా, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో నయన్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించింది. వీళ్లిద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని కోలీవుడ్ లో పెద్ద చర్చే నడుస్తోంది. అప్పుడప్పుడు బయటకు వస్తున్న వీరి ఫొటోలను చూస్తుంటే, లవర్స్ కు మించిన కెమిస్ట్రీ వీరి మధ్య కనిపిస్తోందని చెబుతున్నారు. మరోవిషయం ఏమిటంటే... చెన్నైలోని ఎగ్మూర్ ప్రాంతంలో ఇటీవలే ఖరీదైన ఇంటిని నయనతార కొందట. ఈ ఇంట్లోనే విఘ్నేశ్ తో నయనతార సహజీవనం చేస్తోందని టాక్. అయితే, సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నాక వీరిద్దరూ కలిసుంటున్నారా? లేదా పెళ్లి కాకుండానే సహజీవనం మొదలు పెట్టారా? అనే విషయంలో మాత్రం కొంచెం డివైడ్ టాక్ వినిపిస్తోంది. సరే, ఓ నాలుగు రోజులు ఆగితే... అసలు విషయం తెలుస్తుందిలే అని కోలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.

  • Loading...

More Telugu News