: ఈ రోజు రూ.2 వేల కోట్ల నగదు వస్తోంది.. రాష్ట్రంలో నగదు కొరత తీరుతుంది: చంద్ర‌బాబు


పెద్దనోట్ల రద్దు అనంతరం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఎదుర్కుంటున్న ఇబ్బందుల‌ను తీర్చేందుకు రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆర్థికశాఖ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లతో ఈ రోజు ఉద‌యం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నగదు రహిత లావాదేవీల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆద‌ర్శంగా నిల‌వాల‌ని, ఆ దిశ‌గా అన్ని చ‌ర్య‌లు తీసుకొని ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను త‌గ్గించాల‌ని ఆదేశించారు. నిన్న ఒకటో తేదీ అయిన‌ప్ప‌టికీ ఎంతో ఓర్పుతో పనిచేసినందుకు బ్యాంకర్లకు అభినందనలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ రోజు ఏపీకి రూ.2వేల కోట్ల నగదు వస్తోందని పేర్కొన్న ఆయ‌న‌ దీంతో రాష్ట్రంలో నగదు కొరత తీరే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పారు. ప‌లు రైతుబజార్లలో ఇప్ప‌టికే అవ‌లంబిస్తోన్న టోకెన్ విధానాన్ని మ‌రింత‌ స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించి చిల్ల‌ర క‌ష్టాల‌ను అధిగమించాలని చెప్పారు. చంద్ర‌బాబు నాయుడు భార‌తీయ‌ రిజ‌ర్వు బ్యాంకు గ‌వ‌ర్న‌ర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్ర‌జ‌లు ఎదుర్కుంటున్న ఇబ్బందుల‌ను స‌మ‌గ్రంగా వివ‌రించి, ఏపీకి న‌గ‌దు స‌ర‌ఫ‌రాలో జాప్యంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ ఫ‌లితంగానే నేడు రాష్ట్రానికి న‌గ‌దు చేర‌నుంది.

  • Loading...

More Telugu News