: స్కాండినేవియా ఐపీ అడ్రస్, బెంగళూరు సర్వర్... రాహుల్ ఖాతా హ్యాక్ వీరుల సమాచారం!


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు ఆసక్తికర అంశాన్ని కనుగొన్నారు. బెంగళూరు కేంద్రంగా ఉన్న సర్వర్ ను వాడుకుంటూ, నార్వే లేదా స్వీడన్ ప్రాంతంలో ఉన్న ఐపీ అడ్రస్ ఆధారిత కంప్యూటర్ వాడి రాహుల్ ఖాతాను హ్యాక్ చేశారని తేల్చారు. ఈ కేసులో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని, ఐటీ చట్టంలోని సెక్షన్ 66 కింద విచారణ జరుగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి. ట్రాకింగ్ ను కష్టం చేసేందుకు హ్యాకర్లు మల్టిపుల్ ఐటీ అడ్రస్ సిస్టమ్ ను వాడారని, యాంటీ వైరస్ ఇన్ స్టాల్ చేయని కంప్యూటర్ నుంచి రాహుల్ ఖాతాను తెరిచారని పోలీసులు తెలిపారు. కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News