: కిడ్నాపైన చిన్నారిని రక్షించిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాదులోని ఒవైసీ హిల్స్ లో కిడ్నాప్ కు గురైన జిమ్మీ అనే ఏడాదిన్నర బాలిక కథ సుఖాంతం అయింది. నిన్న అర్ధరాత్రి మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒవైసీ హిల్స్ ప్రాంతానికి చెందిన జిమ్మీని దుండగులు కిడ్నాప్ చేశారు. జరిగిన ఘటనపై జిమ్మీ తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్లపై దాడి చేసి, చిన్నారిని క్షేమంగా కాపాడి, తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ కు పాల్పడ్డ ఓ యువకుడిని, అతనికి సహకరించిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.