: నేడు ఏపీకి రూ. 2500 కోట్లు... తెలంగాణకు రూ. 1600 కోట్లు


తెలుగు రాష్ట్రాల్లో కరెన్సీ కష్టాలకు నేడు కొంత మేర అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఏపీకి రూ. 2500 కోట్లు, తెలంగాణకు రూ. 1600 కోట్ల కరెన్సీ ఈ రోజు వస్తోంది. ఏపీకి రూ. 2500 కోట్లు వస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. మరోవైపు, తెలంగాణకు రూ. 1600 కోట్లు పంపుతున్నట్టు రాష్ట్ర ఆర్థికశాఖకు ఆర్బీఐ నుంచి సమాచారం అందింది. ఈ రూ. 1600 కోట్లలో రూ. 600 కోట్లను హైదరాబాద్ లోని బ్యాంకులకు పంపిణీ చేస్తారు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రంలోని ఇతర జిల్లాల బ్యాంకులకు పంపుతారు. మరోవైపు, డిసెంబర్ 1వ తేదీన ఎంత మంది ఉద్యోగులకు ఎంత మేర నగదు ఇచ్చారన్న విషయాన్ని తెలపాల్సిందిగా బ్యాంకులను తెలంగాణ సర్కార్ కోరింది.

  • Loading...

More Telugu News