: క‌రుణానిధికి ప‌రామ‌ర్శ‌ల వెల్లువ‌.. ఆస్ప‌త్రికి రావొద్దంటున్న స్టాలిన్


అలెర్జీ, శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరిన డీఎంకే చీఫ్‌, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి కరుణానిధికి ప‌రామ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అధినేత‌ను ప‌రామ‌ర్శించేందుకు డీఎంకే నేతలు పెద్ద ఎత్తున ఆస్ప‌త్రికి చేరుకుంటున్నారు. దీంతో ఆస్ప‌త్రికి ఎవ‌రూ రావాల్సిన పనిలేద‌ని క‌రుణానిధి కుమారుడు స్టాలిన్ పార్టీ నేత‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఆయ‌న కోలుకుంటున్నార‌ని పేర్కొన్నారు. వైద్యులు కూడా ఇదే విష‌యం చెప్పారు. క‌రుణానిధి ఆరోగ్యం మెరుగవుతోందని, అయితే మ‌రికొన్ని రోజుల పాటు ఆస్ప‌త్రిలోనే ఉండాల్సి ఉంటుంద‌ని తెలిపారు. క‌రుణానిధి ఆస్ప‌త్రిలో చేరిన విష‌యం తెలుసుకున్న కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఫోన్‌లో క‌నిమొళితో మాట్లాడారు. క‌రుణ ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

  • Loading...

More Telugu News