: మోదీ విదేశాంగ విధానంపై బ్రిటన్ లో పుస్తకం విడుదల


ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానంపై బ్రిటన్‌ లో పుస్తకం విడుదలైంది. ‘ది మోదీ డాక్టరిన్: న్యూ పారాడిజిమ్స్ ఇన్ ఇండియాస్ ఫారిన్ పాలసీ’ పేరుతో విడుదలైన ఈ పుస్తకాన్ని బ్రిటన్ లో భారత హై కమిషనర్ విడుదల చేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీ విదేశాంగ విధానాలు, వ్యవహారాలపై విభిన్న అంశాలను స్పృశిస్తూ పలువురు ప్రముఖులు రాసిన వ్యాసాలను ఇందులో పొందుపరిచారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన నిపుణులు ఆయా రంగాలపై మోదీ విధానాలను వివరిస్తూ రాసిన ఈ పుస్తకానికి విశేషమైన ఆదరణ లభిస్తుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News