: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కొత్త వెయ్యినోటు...త్వరలో రానుందా?
త్వరలో వినియోగంలోకి రానున్న వెయ్యి రూపాయల నోటు అంటూ సరికొత్త కరెన్సీ నోటు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నోటు ఆర్బీఐ విడుదల చేసిన 2,000, 500 రూపాయల నోట్లను పోలి ఉండడంతో త్వరలో 1,000 రూపాయల నోటు అందుబాటులోకి రానుందని అంతా పేర్కొంటున్నారు. పెద్దనోట్ల రద్దును ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడానికి రెండు, మూడు రోజుల ముందే సోషల్ మీడియాలో 2,000 రూపాయల నోట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త వెయ్యి రూపాయల నోట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది కూడా నిజమేనని నెటిజన్లు పేర్కొంటున్నారు.