: లెక్కచూపని బంగారంపైనే 75 శాతం పన్ను: వెంకయ్యనాయుడు


బంగారం విషయంలో కేంద్ర ఆర్థిక‌శాఖ తెలిపిన వివ‌రాలపై కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి వెంక‌య్య‌నాయుడు స్పందించారు. త‌మ ప్ర‌భుత్వం నల్లకుబేరుల వ‌ద్ద ఉన్న డ‌బ్బు, బంగారంపై ఉక్కుపాదం మోపిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్ర‌భుత్వం న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్ట‌డానికి తీసుకున్న పెద్ద‌నోట్ల రద్దు నిర్ణ‌యం అనంత‌రం ర‌ద్దైన నోట్ల‌తో బంగారం కొని నిల్వ చేసుకునే వారి ఆగ‌డాల‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వం చట్టంలో ప‌లు మార్పులు చేసింద‌ని పేర్కొన్నారు. బంగారాన్ని న‌ల్ల‌ధ‌నంతో కాకుండా స‌క్ర‌మంగా కొనుకున్న వారికి ఎటువంటి ఇబ్బందులూ ఉండ‌బోవ‌ని, వారసత్వం, స్త్రీధనంగా వచ్చిన బంగారంపై నిబంధ‌న‌లు ఉండవని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. న‌ల్ల‌కుబేరులు లెక్కచూపని బంగారంపైనే 75 శాతం పన్ను ఉంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News