: రూ.100, 500 నోట్లు కనిపించడం లేదు: మ‌మ‌తా బెన‌ర్జీ


పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశంలో మండిప‌డుతోన్న ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కేంద్ర ప్ర‌భుత్వంపై మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌శ్చిమ‌ బెంగాల్‌తో స‌హా దేశంలోని పలు ప్రాంతాల్లో రూ.100, కొత్త రూ.500 నోట్లు కనిపించడం లేదని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏయే రాష్ట్రాల‌కు ఎంత క‌రెన్సీ ఇచ్చారో భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు లెక్క చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు. కొత్త నోట్ల పంపిణీలో కూడా బీజేపీ నేత‌లు వివ‌క్ష చూపుతున్నార‌ని ఆమె వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు న‌గ‌దు కొర‌త‌తో అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటే కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం నిర్ల‌క్ష్య ధోర‌ణి క‌న‌బ‌రుస్తోంద‌ని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News