: వివాహిత వద్ద 500 గ్రాముల బంగారం ఉండవచ్చు.. బంగారు నగల అంశంపై స్పష్టతనిచ్చిన ఆర్థిక శాఖ
అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన బంగారంపై పన్ను విధించే నేపథ్యంలో తాము తీసుకోనున్న చర్యల్లో భాగంగా కొన్ని విషయాలపై కేంద్ర ఆర్థిక శాఖ ఈ రోజు స్పష్టతనిచ్చింది. కొత్తగా తీసుకొస్తోన్న చట్టంలో పొందుపొరుస్తున్న అంశాల గురించి వివరణనిచ్చింది. దేశంలో వివాహిత 500 గ్రాములు, అవివాహిత 250 గ్రాముల బంగారం కలిగి ఉండవచ్చని చెప్పింది. ఇక పురుషులు 100 గ్రాముల బంగారం కలిగి ఉండవచ్చని పేర్కొంది. వారసత్వంగా వచ్చిన, లెక్కచూపిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై ఎటువంటి పన్నులు ఉండబోవని స్పష్టం చేసింది.