: జూనియర్ హాకీ ప్రపంచ కప్ కి పాక్ డుమ్మా...మలేషియాకు ఆహ్వానం
భారత్ లో నిర్వహించనున్న జూనియర్ హాకీ ప్రపంచకప్ కు పాకిస్థాన్ డుమ్మాకొట్టింది. డిసెంబర్ 8-18 వరకు లక్నో వేదికగా జూనియర్ హాకీ ప్రపంచకప్ ప్రారంభం కానుంది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ తమ జట్టు భారత్ లో పర్యటించలేదని పాక్ తెలిపింది. పాకిస్థాన్ జట్టు గైర్హాజరు నేపథ్యంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య మలేసియా జట్టును టోర్నీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో ఇప్పటికే భారత్, పాక్ మధ్య అంతంతమాత్రంగానే ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మరింత దిగజారడం విశేషం. ఇప్పటికే పాకిస్థాన్ తో ఆడేందుకు బీసీసీఐ అంగీకరించని సంగతి తెలిసిందే.