: షూటింగ్ నుంచి వాకౌట్ చేయడంపై క్లారిటీ ఇచ్చిన జయసుధ


'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' సినిమా సెట్ నుంచి సహజనటి జయసుధ వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ కు లేట్ గా వస్తుండటంతో ఆ సినిమా దర్శకనిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆమెను హెచ్చరించారని... ఈ నేపథ్యంలో, ఆమె వాకౌట్ చేశారనేది వార్త. దీనిపై జయసుధ క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి, గత 30 ఏళ్లుగా తన కాస్ట్యూమ్స్ ను జయసుధే డిజైన్ చేసుకుంటున్నారు. తన దుస్తులకు సంబంధించి ఒక రోజు ముందే దర్శకుడితో ఆమె చర్చిస్తారు. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో కాస్ట్యూమ్స్ అందడం లేటయింది. దీంతో, షూటింగ్ కు ఆమె ఆలస్యంగా వచ్చారు. ఇది తెలియని చదలవాడ ఆమెపై కొంచెం సీరియస్ కావడంతో... సెట్ నుంచి ఆమె వాకౌట్ చేశారు. దీనిపై జయసుధ మాట్లాడుతూ, ఇది చాలా చిన్న విషయమని... దీనిపై తాను, డైరెక్టర్ ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నామని చెప్పారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలిపారు. ఈ సినిమాలో ఆర్ నారాయణమూర్తి, జయసుధ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News