: బ్యాంకు ఖాతాదారులపై పోలీస్ దాడులకు క్షమాపణలు చెబుతున్నా!: ఏపీ డీజీపీ సాంబశివరావు
నగదు కోసం బ్యాంకు క్యూ లైనల్లో నిలబడిన ఖాతాదారులపై జరిగిన పోలీస్ దాడులను ఖండిస్తున్నానని, పోలీస్ శాఖ తరపున ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. గుంటూరులో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం నగరంలోని బ్యాంకులు, ఏటీఎంల వద్ద పరిస్థితిని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ, ఒక బ్యాంకు వద్ద ఖాతాదారుడిపై దాడి చేసిన డీఎస్పీ కమలాకరరావుపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.