: అలియాభట్ భట్ 'ముద్దు' ముచ్చట్లు!
బాలీవుడ్ హీరోయిన్ల బోల్డ్ స్టేట్ మెంట్లు అభిమానులకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగిస్తుంటాయి. గతంలో ఫ్రీదా పింటో, ఇలియానా డిక్రూజ్ శృంగారపై ఆసక్తికర కామెంట్లతో బాలీవుడ్ లో కలకలం రేపగా, తాజాగా యువ నటి అలియా భట్ లిప్ లాక్ లపై వ్యాఖ్యలు చేసి ఆకట్టుకుంటోంది. నేహా ధూపియా నిర్వహిస్తున్న షోలో పాల్గొన్న సందర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ...బాలీవుడ్ లో ఇమ్రాన్ హష్మీని సీరియల్ కిస్సర్ అంటారు కానీ, సిద్ధార్థ్ మల్హోత్రా బాగా ముద్దులు పెడతాడని తెలిపింది. తాను గతంలో అర్జున్ కపూర్ ను ఒక సినిమాలో ముద్దు పెట్టుకున్నానని, అతను బాగా ముద్దు పెడతాడని చెప్పింది. అయితే సిధ్ధార్థ్ మల్హోత్రాతో రెండు సినిమాల్లో ముద్దులు పెట్టుకున్నానని, అతను ముద్దుల్లో ఆరితేరాడని, బెస్ట్ కిస్సర్ అవార్డు అంటూ ఇస్తే కనుక సిద్ధార్థ్ కే ఇవ్వాలని తెలిపింది. కాగా, సిద్ధార్థ్ తో అలియా ప్రేమలో ఉందంటూ బాలీవుడ్ లో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.