: మోదీవల్ల అభిమానులను కలుసుకునే అవకాశం కలిగింది: అనిల్ కపూర్


ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం కారణంగా అభిమానులను కలుసుకునే అవకాశం కలిగిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తెలిపాడు. నోట్ల రద్దుతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలోని ఓ ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు గత అర్ధరాత్రి అనిల్ కపూర్ క్యూలైన్లో నిల్చున్నాడు. అప్పటికే క్యూలో ఉన్న ఇద్దరు యువతులు అనిల్ కపూర్ క్యూలో ఉన్నాడంటూ సెల్పీ తీసి సోషల్ మీడియాలో ఆ ఫోటో పోస్టు చేశారు. దీంతో ఇది వైరల్ గా మారింది. అనంతరం ఆ ట్వీట్ ను రీట్వీట్ చేసిన అనిల్ కపూర్, ఈ రకంగా అభిమానులను కలుసుకునే అవకాశం కల్పించిన మోదీకి ధన్యవాదాలు తెలిపాడు.

  • Loading...

More Telugu News