: తనపై వస్తున్న పుకార్లకు ముగింపు పలికిన పాక్ క్రికెటర్
అంతర్జాతీయ క్రికెట్ కు త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంటూ పాకిస్థాన్ టెస్ట్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ కు సంబంధించి వార్తలు వెలువడుతున్నాయి. అయితే, తనపై వస్తున్న ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు మిస్బా. తన రిటైర్మెంట్ నిర్ణయం కేవలం తన చేతిలోనే ఉందనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని అతను కోరాడు. తన రిటైర్మెంట్ ను ముందే ప్రకటించి... ఏదో సత్కారం పొందాలనే ఆలోచన తనకు లేదని తెలిపాడు. క్రికెట్ ఆడటానికి వయసుతో పనిలేదని... ఫిట్ నెస్ ఉన్నంత వరకు జట్టుకు సేవలందించవచ్చని చెప్పాడు. ఒక సీనియర్ ప్లేయర్ గా యువకులకు ఎలా ఉపయోగపడాలి అనే దానిపైనే తన ఆలోచన ఉందని తెలిపాడు.