: జియో సిమ్ వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్.. వచ్చే ఏడాది మార్చి 31 వరకు సేవలు ఉచితం
జియో సిమ్ వినియోగదారులకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని శుభవార్త అందించారు. ఈ రోజు ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మార్చి 31 వరకు జియో సేవలు ఉచితంగా లభిస్తాయని ప్రకటించారు. అంతేగాక, నెంబరు పోర్టబులిటీని స్వీకరించేందుకు జియో సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ నెల 31 నుంచి దేశంలోని 100 నగరాల్లో వినియోగదారులు ఆర్డర్ చేసుకుంటే ఇంటి వద్దకే జియో సిమ్‌ను పంపే సౌలభ్యాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 5 కోట్ల మంది జియో సిమ్‌ను తీసుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.