: ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టునే టార్గెట్ చేసిన రాం గోపాల్ వర్మ .. 'జాతీయగీతం ప్రదర్శన' తీర్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు
సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. గౌరవం అనేది వ్యక్తిగతంగా ఉండాలని... కచ్చితంగా గౌరవించాల్సిందే అనే కండిషన్ పెడితే, అసలుకే మోసం రావచ్చని, జాతీయగీతంపై అగౌరవం కూడా కలగవచ్చంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం సినిమా థియేటర్లలోనే జాతీయగీతాన్ని ఎందుకు ప్రదర్శించాలని... షాపుల్లో ఎందుకు ప్రదర్శించకూడదని ప్రశ్నించాడు. కస్టమర్ తన షాపులోకి వస్తున్నప్పుడు జాగీయగీతం వీడియోను చూడాలంటూ షాప్ ఓనర్ ఎందుకు అడగకూడదంటూ ట్వీట్ చేశాడు. టీవీ ప్రోగ్రామ్ లలో, టీవీ సీరియల్స్ లో, రేడియో ప్రోగ్రామ్స్ లో జాతీయగీతాన్ని ఎందుకు ప్రదర్శించకూడదంటూ వర్మ ప్రశ్నించాడు. టీవీలో మన దేశంలోని గొప్ప నేతల పాలసీలను కించపరుస్తూ రిపోర్ట్ చేసేముందు జాతీయగీతాన్ని ఎందుకు వేయకూడదు? అని అడిగాడు. వార్తాపత్రికల్లోని మొదటి పేజీలో జాతీయగీతాన్ని ఎందుకు ప్రింట్ చేయకూడదు? అని ప్రశ్నించాడు. దేవాలయాలు, చర్చ్ లు, మసీదుల్లో ప్రార్థనలకు ముందు జాతీయగీతాన్ని ఆలపించకూడదా? అని అన్నాడు. నైట్ క్లబ్బుల్లో డ్యాన్సింగ్ కి ముందు, మద్యం సేవించడానికి ముందు జాతీయగీతం ఆలపించడాన్ని కంపల్సరీ చేయకూడదా? అని ప్రశ్నించాడు.