: ‘కొత్తనోట్ల రవాణాకు విమానాల కొరత లేదు’.. మోదీని కలిసిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) చీఫ్ అరుప్ రాహా ఈ రోజు పార్లమెంటు ఆవరణలోని ప్రధానమంత్రి కార్యాలయానికి వచ్చి అక్కడ నరేంద్ర మోదీతో చర్చించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కొత్త నోట్లను పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధవిమానాలను వినియోగిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై మోదీతో అరుప్ రాహా చర్చించారు. కరెన్సీకోసం విమానాలను ఉపయోగిస్తోన్న విధానంపై వివరించారు. కరెన్సీ రవాణాకు విమానాల కొరత లేదని చెప్పారు. ఎయిర్‌ఫోర్స్ విమానాల ద్వారా కరెన్సీ రవాణా నిర్విఘ్నంగా జరుగుతోందని తెలిపారు.