: మమతా బెనర్జీని చంపాలనుకున్నారు... ఇంతకన్నా దుర్మార్గముందా?: పార్లమెంట్లో మోదీపై విరుచుకుపడ్డ టీఎంసీ


తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని హత్య చేయాలన్న కుట్ర జరిగిందని, అందుకు డీజీసీఏ, కోల్ కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లు తమ వంతు సాయం చేయాలని ప్రయత్నించాయని టీఎంసీ ఎంపీలు నేడు పార్లమెంట్ లో సంచలన ఆరోపణలు చేశారు. మోదీ ప్రభుత్వం తమకు ఎదురు నిలుస్తున్న వారిని పక్కకు తప్పించాలని చూస్తోందని, అందులో భాగంగానే, ఓ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానంలో సరిపడా ఇంధనాన్ని ఇవ్వలేదని ఆ పార్టీ ఎంపీలు ఆరోపించారు. తమ నేత ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ కు అనుమతించలేదని, అందుకు ప్రధాని మోదీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని, ముఖ్యమంత్రులకే దేశంలో రక్షణ కరవైందని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కాగా, తృణమూల్ ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది. విమానాశ్రయాలు బిజీగా ఉన్న వేళ ల్యాండింగ్ అనుమతి లభించదని పౌరవిమానయాన వర్గాలు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News