: మమతా బెనర్జీ ప్రయాణించిన ఇండిగో విమాన అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిన తృణమూల్
పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. నగ్రొటాలో వీరమరణం పొందిన జవాన్లకు లోక్‌సభ నివాళులర్పించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తోన్న ఇండిగో విమానం ఈ రోజు కోల్ కతాలో అరగంట లేటుగా లాండ్ అయిన విషయం తెలిసిందే. అనుకున్న సమయానికి ల్యాండింగ్ అవడానికి విమానాశ్రయ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇంధనం అయిపోతోందని ఫైలట్ కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ అంశంపై ఈ రోజు పార్లమెంటులో గందరగోళం నెలకొంది. విమాన అంశాన్ని తృణమూల్ ఎంపీలు లేవనెత్తారు. తమ అధినేత్రిపై కుట్రలు పన్నారని అన్నారు. విచారణ జరిపితే సమగ్ర విషయాలు వెల్లడవుతాయని అన్నారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు విమానంలో ఇంధనం తక్కువగా ఉన్న ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.