: నేడు అదిరిపోయే కొత్త ప్లాన్ చెప్పనున్న ముఖేష్ అంబానీ!
రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఆఫర్ ను ప్రకటించిన తరువాత, తొలిసారిగా నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు సంస్థ ఉద్యోగులు, వాటాదారులు, డైరెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించనున్న ముఖేష్ అంబానీ, మరో ఆసక్తికర, అదిరిపోయే కొత్త ప్లాన్ ను తన నోటి నుంచి చెప్పనున్నారని తెలుస్తోంది. ఆయన ఓ పెద్ద ఎనౌన్స్ మెంట్ చేయనున్నారని సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. డిసెంబర్ 31తో రిలయన్స్ జియో ఆఫర్ ముగియనుండగా, ఈ ఆఫర్ పొడిగింపును ఆయన ప్రధానంగా ప్రకటించవచ్చని, జియో డేటా ఆఫర్ గా ఉన్న రూ. 50కి జీబీని మరింతగా తగ్గిస్తూ, కొత్త ప్లాన్ లను ఆవిష్కరించవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతం రిలయన్స్ జియో రూ. 149 నుంచి రూ. 4,999 మధ్య పలు ప్యాకేజీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నేటి మధ్యాహ్నం ముఖేష్ ఏం మాట్లాడతాడన్నది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.