: రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్... రాహుల్ పై పేలిన జోకులు


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. నిన్న సాయంత్రం రాహుల్ అకౌంట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు... రాహుల్ గురించి, ఆయన కుటుంబీకుల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలను పోస్టు చేశారు. వెంటనే ఈ విషయాన్ని గుర్తించిన రాహుల్ టీమ్... ఆ ట్వీట్లను తొలగించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అభ్యంతరకర ట్వీట్లు ప్రింట్ స్క్రీన్ల రూపంలో నెటిజన్లకు చేరిపోయాయి. ఇప్పటికీ చిన్నపిల్లాడిగానే వ్యవహరించే రాహుల్ తన అకౌంట్ పాస్ వర్డ్ ను 'చోటా భీమ్'గా పెట్టుకొని ఉంటాడని... అందుకే ఆయన అకౌంట్ ను హ్యకర్లు ఈజీగా హ్యాక్ చేయగలిగారని ఓ నెటిజన్ జోక్ పేల్చాడు. పాస్ వర్డ్ స్ట్రాంగ్ గా ఉండాలనే ఉద్దేశంతో... 'నరేంద్ర మోదీ' అనే పాస్ వర్డ్ ను పెట్టుకుని ఉంటాడని మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు. ఇలా... రాహుల్ పై పలువురు నెటిజెన్లు జోకులు పేల్చారు.

  • Loading...

More Telugu News