: మూడేళ్ల నాటి అఫ్జల్ గురు ఉరితీతకు మా ప్రతీకారం తొలి ఇన్ స్టాల్ మెంట్ ఇదే!: నగ్రోటా ఉగ్రవాదుల వద్ద లేఖ
2011లో పార్లమెంట్ పై దాడి కేసులో ప్రధాన దోషి, అఫ్జల్ గురుకు 2013లో ఉరిశిక్ష వేసినందుకు ప్రతీకారంగానే నగ్రోటాపై ఉగ్రదాడి జరుపుతున్నట్టు ఉగ్రవాదుల వద్ద లేఖ లభించింది. సైన్యం కాల్పుల్లో చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాల వద్ద ఉర్దూ భాషలో అఫ్జల్ గురూని చంపినందుకు ప్రతీకారంగా తొలి ఇన్ స్టాల్ మెంట్ అని రాసి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. వీరి వద్ద ఉన్న పలు వస్తువులు ఇండియాలో తయారైనవే కావడంతో ఎవరో స్థానికులు మద్దతిచ్చారని కూడా భావిస్తున్నారు. కాగా, చమిల్యాల్ ప్రాంతంలో భూమిలో సొరంగం తవ్వి వీరు ఇండియాలోకి ప్రవేశించి దాడి చేసినట్టు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ వెల్లడించారు.