: అమ్మాయిలను తమ రూమ్ కు ఆహ్వానించిన బంగ్లా క్రికెటర్లు... ఫైన్ వేసిన బీసీబీ


నిబంధనలకు విరుద్ధంగా యువతులను హోటల్ గదులకు ఆహ్వానించిన బంగ్లాదేశ్ క్రికెటర్లపై భారీ జరిమానా పడింది. పేస్ బౌలర్ అల్‌ అమీన్‌ హుస్సేన్‌, బ్యాట్స్‌మన్‌ షబ్బీర్‌ రహమాన్‌ లు జట్టు ప్రతిష్ఠను మసకబార్చే పనులు చేశారని వెల్లడిస్తూ, ఒక్కొక్కరిపై 15 వేల డాలర్లు (సుమారు రూ. 10 లక్షలు) జరిమానా విధిస్తున్నట్టు బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) తెలిపింది. మరోసారి ఇదే పని చేస్తే, కఠినంగా దండిస్తామని హెచ్చరించింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న ఈ ఇద్దరు ఆటగాళ్లూ జాతీయ జట్టుకూ సేవలందించాల్సి వుందని, ఇటువంటి బాధ్యతారాహిత్య చర్యలను సహించబోమని బీసీబీ పేర్కొంది.

  • Loading...

More Telugu News