: రూ.వంద కోట్ల విలువైన రూ.500 నోట్ల ముద్రణ.. నెలాఖరు నాటికి అందుబాటులోకి
నోట్ల రద్దు తదనంతర పరిణామాలతో ఇక్కట్లు పడుతున్న ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చే వార్తే. ఈ నెలాఖరు నాటికి వంద కోట్ల రూపాయల విలువైన కొత్త రూ.500 నోట్లను ముద్రించి బ్యాంకులకు అందించాలని రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన నోట్లను ముద్రిస్తున్నట్టు తెలిపింది. నోట్ల రద్దు నేపథ్యంలో నోట్ల ముద్రణ ఆశించిన స్థాయిలో జరగలేదని విచారం వ్యక్తం చేసిన ఆర్బీఐ జనవరి నాటికి నోట్ల కొరతను పూర్తిగా అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా ప్రజల నుంచి డిపాజిట్ల ద్వారా వచ్చిన రద్దయిన పెద్ద నోట్లను ధ్వంసం చేసేందుకు ఏడాదికిపైగా పడుతుందని ఆర్బీఐ పేర్కొంది. ఇప్పటి వరకు రూ.1500 కోట్ల విలువైన పాత రూ.500, రూ.1000 నోట్లు తమకు అందాయని తెలిపింది. ముంబైలో వీటిని తనిఖీ చేసి ముక్కలు చేయనున్నట్టు రిజర్వు బ్యాంకు అధికారులు తెలిపారు.