: చిల్లర కోసం కానిస్టేబుళ్ల దౌర్జన్యం.. పాన్‌షాప్ నిర్వాహకుడిపై దాడి.. తిరగబడడంతో పలాయనం
చిల్లర కోసం హైదరాబాద్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు వీరంగం సృష్టించారు. ఓ పాన్‌షాపు నిర్వాహకుడిపై దాడికి దిగారు. అతడు తిరగబడడంతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కుల్సుంపురంలో విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు మరో వ్యక్తితో కలిసి గండిమైసమ్మ వద్ద విందుకు వెళ్లారు. తిరిగి వస్తూ మార్గమధ్యంలో నార్సింగ్‌లో ఓ పాన్‌షాపు వద్ద ఆగారు. చిల్లర కోసం పాన్‌షాపు నిర్వాహకుడితో ఘర్షణకు దిగారు. మాటమాట పెరిగి గొడవ పెద్దదైంది. దీంతో షాపు యజమాని అనుచరులు అక్కడికి చేరుకుని కానిస్టేబుళ్లపై తిరగబడ్డారు. దీంతో తోకముడిచిన కానిస్టేబుళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. కానిస్టేబుళ్ల దురుసు ప్రవర్తనపై పాన్‌షాపు యజమాని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్యకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆయన విచారణకు ఆదేశించారు.