: డీఎంకే అధినేత క‌రుణానిధికి అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌


డీఎంకే చీఫ్‌, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి అస్వ‌స్థ‌తతో ఆస్ప్ర‌త్రిలో చేరారు. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న తాజాగా మ‌రోమారు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. గ‌త‌నెల‌లోనూ ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. కరుణానిధి ఆస్ప‌త్రిలో చేరార‌న్న విష‌యం తెలిసి పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఆందోళ‌న‌లో మునిగిపోయారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు. కాగా ఇప్ప‌టికే త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, ఏఐఏడీఎంకే చీఫ్ జ‌య‌ల‌లిత ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. పూర్తిగా కోలుకున్న ఆమె త్వ‌ర‌లోనే ఇంటికి చేరే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News