: హ్యాంకింగ్ కు గురైన రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంటును హ్యాక్ చేశారు. సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోని రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి వస్తున్న ఆదరణ కారణంగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. తుంటరి హ్యాకర్లు ఆయన ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి, అందులో అసభ్యకరమైన మెసేజ్ లు ఉంచారు. రాహుల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ బారినపడిందని ఆయన కార్యాలయం ప్రకటించింది. త్వరలోనే ఆయన అకౌంట్ ను పునరుద్ధరిస్తామని తెలిపారు.