: మహిళల సెంటిమెంట్ తో ఆడుకోవద్దని బీజేపీకి చెబుతున్నాం: ఎమ్మెల్యే బోండా


ప్రజల వద్ద వున్న బంగారం గురించిన లెక్కలు అడుగుతున్న కేంద్ర ప్రభుత్వంపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బంగారంతో మహిళలకు విడదీయరాని సంబంధం ఉందని, పాత బంగారం జోలికి వెళ్లడం తుగ్లక్ నిర్ణయమని విమర్శించారు. మహిళల సెంటిమెంట్ తో ఆడుకోవద్దని బీజేపీకి చెబుతున్నామన్నారు. కాగా, ఐటీ చట్టసవరణ బిల్లులో బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినంలను కేంద్ర ప్రభుత్వం చేర్చింది. 69 ఏ, 69 బి సెక్షన్ల ప్రకారం ఆభరణాల లెక్క కూడా చెప్పాల్సిందేనని, తరతరాల నుంచి వచ్చిన ఆభరణాలకైనా సరే, బిల్లులు చూపించాలని కేంద్రం పేర్కొంది.

  • Loading...

More Telugu News