: హాస్యనటుడిపై ఇంకు చల్లిన ఒడిశావాసులు!
ఒడిశా హాస్య నటుడు పాపు పాంపాంపై హిందూసేన కార్యకర్తలు ఇంకుచల్లారు. ఒడిశా వాసులు భక్తిప్రపత్తులతో పూజించే జగన్నాథునిపై పాపు పాం ఓ షోలో పాల్గొన్న సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు వ్యక్తులు, భువనేశ్వర్ నుంచి కటక్ వెళ్తున్న రహదారిలో పాపు పాంపాంను ఆపారు. దీంతో వారికి షేక్ ఇస్తుండగా, అతని చేయిపట్టుకున్న ఓ వ్యక్తి అతని ముఖంపై నల్లసిరా చల్లాడు. దీంతో బిత్తరపోయిన పాపు పాంపాంను చొక్కాపట్టుకుని ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. క్షమాపణలు చెప్పాలని కోరడంతో లెంపలేసుకున్న పాపు పాంపాం వారికి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.