: ‘కాటమరాయుడు’ సెట్ లో నందమూరి తారకరత్న


పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్ జంటగా తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు’ చిత్రం సెట్ లో నందమూరి తారకరత్న దర్శనమిచ్చాడు. అక్కడి చిత్ర బృందంతో కలిసి భోజనం చేశాడు. ఈ సందర్భంగా తీసిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఎప్పుడూ లేనిది పవన్ సినిమా సెట్స్ లో తారకరత్న కనిపించడంతో అభిమానుల్లో కుతూహలం పెరుగుతోంది. ఈ చిత్రంలో ఆయన ఏదైనా పాత్ర పోషిస్తున్నాడా? అన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కాగా, 'కాటమరాయుడు' చిత్రానికి కిషోర్ కుమార్ పార్దసాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కు సోదరులుగా నటులు శివబాలాజీ, అజయ్, కమల్ కామరాజు నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News